జగన్ కోసం పనిచేసిన క్రైస్తవులు ఆవేదనలో ఉన్నారు : బ్రదర్ అనిల్

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (19:41 IST)
వైకాపా అధినేక జగన్మోహన్ రెడ్డి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం కోసం పని చేసిన క్రైస్తవులంతా తీవ్ర ఆవేదనలో ఉన్నారని ఆయన బామ్మర్థి, వైఎస్ షర్మిల భర్త, ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు బ్రదర్ అనిల్ అన్నారు. కాగా, ఈయన భార్య వైఎస్. షర్మిల తెలంగాణలో తన తండ్రి పేరుమీద రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీకి అన్నీ తానే బ్రదర్ అనిల్ పనిచేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ, 2019లో ఏపీ సీఎం జగన్ కోసం పని చేసిన క్రైస్తవులు ఇపుడు తీవర ఆవేదనలో ఉన్నారన్నారు. ఇటీవలే తనతో భేటీ అయిన కొందరు క్రైస్తవులు ఇదే మాటలు తనతో చెప్పారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 
 
అదేసమయంలో తాము ఏపీ వేదికగా కొత్త పార్టీని పెట్టడం లేదన్నారు. ఈ విషయంపై సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వెల్లడించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను ప్రత్యేకంగా కలవడం వెనుక ఏ విధమైన ప్రత్యేక అంశం లేదన్నారు. ఏదైనా ఉంటే మాత్రం తానే స్వయంగా వెల్లడిస్తానని బ్రదర్ అనిల్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments