వధువు అలసిపోయింది.. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో కుప్పకూలింది..

Webdunia
గురువారం, 12 మే 2022 (13:29 IST)
పెళ్లికి అంతా సిద్ధమైంది. తాళికట్టడమే తరువాయి. పండితులు వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే ప్రక్రియ మొదలయింది. ఇంతలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. వధువు పెళ్లి వేదికపైనే కుప్పకూలింది. అంతేకాదు ప్రాణాలు కూడా కోల్పోయింది. ఈ ఘటన విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. విశాఖ, మధురావాడ, పాలెంలో బుధవారం రాత్రి నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి.  కానీ జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది. కుటుంబ సభ్యులు కంగారుపడి ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. 
 
పెళ్లికూతురు బాగా అలసిపోవడంతోనే నీరసంగా కనిపించిందని.. కానీ ఇలా ప్రాణాలు కోల్పోతుందని భావించలేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments