శుభలేఖలు పంచుతున్న వధువును ముగ్గురు కామాంధులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఓ రాజకీయ నేతకు విక్రయించారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత నెల 21వ తేదీన బాధిత యువతికి పెళ్లి జరగాల్సివుంది. ఇందుకోసం 18వ తేదీన శుభలేఖలు పంచేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ముగ్గురు యువకులు ఆ యువతిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఆ యువతిని తమతోనే ఉంచుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత ఓ రాజకీయ నేతకు అప్పగించారు. ఆయన కొన్ని రోజుల పాటు బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాటియా జిల్లా పఠారి గ్రామంలోని మరో వ్యక్తి వద్దకు పంపించారు. అక్కడ నుంచి తప్పించుకుని బయటపడిన ఆ యువతి.. పోలీసులను ఆశ్రయించింది. ఆ యువతి ఫిర్యాదుపై తక్షణం స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.