తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ఖరారు చేసింది. అక్టోబర్ 7వ తేదీ నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు తెలిపింది.
కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తితిదే పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని జరపనున్నట్లు వెల్లడించింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి వాహనసేవల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
ఏ రోజు.. ఏ సేవ..
06-10-2021: అంకురార్పణ (సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు)