Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం.. బాలికపై దాడి..

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (09:48 IST)
విజయవాడ నగరంలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఓ బాలికపై దాడికి చేశాడు. ప్రేమించిలేదన్న కోపంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ భారతీ నగర్‌కు చెందిన ఓ  హరీశ్ అనే బాలుడుడు, బాలిక కలిసి స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో మూడేళ్ళపాటు కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం ఈ బాలిక ఇంటర్మీడియట్ చదువుతుంది.

పాఠశాలలో చదువుకునే రోజుల నుంచి ఆ బాలికను హరీశ్ ప్రేమిస్తూ వచ్చాడు. కానీ, ఆమె మాత్రం ప్రేమించలేదు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన బాలిక పుట్టిన రోజును పురస్కరించుకుని తన ప్రేమను చెప్పాడు. దీనికి ఆమె నిరాకరించింది. 

అప్పటి నుంచి తనను తనను ప్రేమించాలని ఆయువతి వెంట ప్మేమోన్మాది వెంటపడసాగాడు. దీనికి ఆమె నిరాకరించింది. తన పట్ల అతను నడుచుకుంటున్న తీరుతో ఆమె విసిగిపోయి చెంపదెబ్బ కొట్టింది. 
 
దీంతో వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆమె నివసించే ఇంటికి వెళ్లి ఆ బాలికపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఆమె ఇంటికి సమీపంలోనే జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. హరీశ్‌ను పోలీసుుల అరెస్టు చేశారు. ఈ నిందితుడు కూడా హైదరాబాద్ నగరంలో ఇంటర్ చదువుతున్నాడు. తన ప్రియురాలి పుట్టిన రోజు కోసం విజయవాడ నగరానికి వచ్చి ఈ ఘుతుకానికి పాల్పడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments