Webdunia - Bharat's app for daily news and videos

Install App

బినామీలపై సునామీ... లాకర్లు పగులగొడతారా...? నల్ల కుబేరుల గుండె గుల్ల...

న్యూఢిల్లీ : నేను ఏమైపోయినా ఫరవాలేదు... నల్లధనాన్ని రూపుమాపుతా అని ప్రధాని మోడీ ఘంటాపథంగా చెప్పారు. 500, 1000 నోట్ల రద్దుతో నల్ల కుబేరులను గడగడలాడించారు. ఇక తరువాయి సర్జికల్ దాడి బినామీ ఆస్తులపైనే అని ప్రకటించటంతో ఆర్ధిక అక్రమార్కుల గుండెల్లో రైళ్లు

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (13:35 IST)
న్యూఢిల్లీ : నేను ఏమైపోయినా ఫరవాలేదు... నల్లధనాన్ని రూపుమాపుతా అని ప్రధాని మోడీ ఘంటాపథంగా చెప్పారు.  500, 1000 నోట్ల రద్దుతో నల్ల కుబేరులను గడగడలాడించారు. ఇక తరువాయి సర్జికల్ దాడి బినామీ ఆస్తులపైనే అని ప్రకటించటంతో ఆర్ధిక అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అడ్డగోలుగా, అక్రమంగా, దొంగ నోట్ల చెలామణి ద్వారా ఆర్జించిన, లెక్కకు మించి కూడబెట్టిన నల్ల ధనంతో కనీసం 10 లక్షలు కూడా చెయ్యని వ్యవసాయ భూములను కోటికి పైగా విసిరేసి కొనటం, రూపాయి ఆదయంలేని వారి పేరుపై భూములు, భవనాలు కొనుగోలు చేసి నల్లధనం చెలామణి చెయ్యటంపై ఇక మోడీ చర్యలు తీసుకోనున్నారు. 
 
నల్లధనం వల్ల అసాంఘిక వ్యాపారాలు, మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదం వంటివి పెరిగిపోతున్నాయి. కరెన్సీ నోట్లను నిర్భయంగా మార్చిన తాడూ బొంగరం లేని వారు ఇపుడు కేంద్రం టార్గెట్ కాబోతున్నారు. నూరు గొడ్డను తిన్న రాబందు గాలివానకు గోవిందా అనే సామెతలాగా ఇలాంటి అడ్డగోలు పనులు చేసిన వారి వంతు రాబోతోంది. 
 
తరువాతి సర్జికల్ దాడి బినామీ ఆస్తులపై జరగనుండటంతో ఏమి చెయ్యలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పులి మీద పుట్రలా రేపోమాపో అనుమానితుల లాకర్ల మీద దాడి జరిపేందుకు ప్రభుత్వం తయారుగా ఉన్నట్లు తాజా సమాచారం ద్వారా తెలియవస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments