Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలపై వస్త్రం ఎందుకు తల్లీ.. మెడకు చుట్టుకుని ఉరేసుకుని చచ్చిపో.. ముస్లిం టీచర్‌కు బెదిరింపులు

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ త్వరలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో.. 24 ఏళ్ల ముస్లిం ఉపాధ్యాయురాలికి చేదు అనుభవం ఎదురైంది. తమదేశంలో ఇక హిజాబ్‌ను అంగీకరించబోమని, కాబట్టి స్కార్ఫ్‌ను మెడకు చుట

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (13:07 IST)
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ త్వరలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో.. 24 ఏళ్ల ముస్లిం ఉపాధ్యాయురాలికి చేదు అనుభవం ఎదురైంది. తమదేశంలో ఇక హిజాబ్‌ను అంగీకరించబోమని, కాబట్టి స్కార్ఫ్‌ను మెడకు చుట్టుకొని ఉరేసుకొని చచ్చిపో అంటూ ఆమెకు బెదిరింపు లేఖ రావడం చర్చనీయాంశమైంది. 
 
వివరాల్లోకి వెళితే.. జార్జియా అట్లాంటాలోని గ్విన్నెట్‌ కౌంటీలో హైస్కూలో పనిచేస్తున్న మిర్హా టెలి అనే ఉపాధ్యాయురాలికి.. ‘టెలి, ఇక నీ తలపై వేసుకొనే వస్త్రాన్ని ఎంతమాత్రం అంగీకరించబోం. ఎందుకు నువ్వు దానిని మెడకు చుట్టుకొని ఉరేసుకోవు’ అంటూ నల్లసిరాతో ఓ లేఖ ఆమెకు వచ్చింది. దీనిపై అమెరికా అని సంతకం చేసి ఉంది. ముస్లింగా తన మతవిశ్వాసం ప్రకారం తాను తలపై వస్త్రాన్ని ధరిస్తే.. ఇలాంటి బెదిరింపులు రావడం దారుణమని టెలి ఆవేదన వ్యక్తం చేసింది. 
 
అమెరికాలో తమ కమ్యూనిటీ ఎదుర్కొనే కష్టాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నానని.. విద్వేషాన్ని వ్యాప్తి చేయడం వల్ల అమెరికా మళ్లీ గొప్ప దేశం కాబోదని టెలి తన ఫేస్ బుక్‌లో వెల్లడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments