Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నియోజకవర్గంలో అవినీతి : సోము వీర్రాజు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు.

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (10:49 IST)
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో రూ.10 కోట్ల అవినీతి జరిగిందని, రెండెకరాల రైతును అని చెప్పుకొనే చంద్రబాబుకు రూ.లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. 
 
కేంద్ర నిధులతో పనులు చేస్తూ ఆ పథకాలకు ప్రధాని మోడీ ఫోటో పెట్టుకోవడం లేదని మండిపడ్డారు. తెలుగుదేశం నాయకులు అవినీతికి వారసులని, తాము నిప్పులాంటి వాళ్లమని అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకే అవినీతిపై స్పందిస్తున్నామని కూడా జోడించారు. దీంతో బీజేపీ.. టీడీపీ పొత్తుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వీర్రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments