Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ళ తర్వాత మూసేసే పార్టీ వైకాపా : బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (15:22 IST)
ఏపీకి భారతీయ జనతా పార్టీ నేత విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ళ తర్వాత మూసేసే పార్టీ వైకాపా అంటూ సంచలన కామెంట్స్ చేసారు. ఈయన ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉంటున్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'వైసీపీ మూసేసే పార్టీ. మూడు సంవత్సరాల తర్వాత ఆ పార్టీ ఉండదు. గ్యారెంటీగా చెబుతున్నా. కావాలంటే రాసిపెట్టుకోండి. మూసేయడం అంటే ఆ పార్టీ అధికారంలో ఉండదని అర్థం' అంటూ విష్ణుకుమార్ వ్యాఖ్యానించారు. 
 
తెలుగు దేశం పార్టీ ఓడిపోతుందని తాను ముందే చెప్పానని, అదే జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నోటికి వచ్చింది చెప్పడానికి తాను ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌ను కానని విష్ణుకుమార్ సెటైర్ వేశారు. ఇప్పటికే ప్రజలు జగన్ పాలనపై విసుగెత్తిపోయారని చెప్పారు. 
 
ప్రజలకు జగన్ ముద్దులు పెడితే నిజమైన ప్రేమ అనుకున్నారని, కానీ ఇప్పుడు వారికి అది కపట ప్రేమ అని తెలిసిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే లోపల వేస్తున్నారని దుయ్యబట్టారు. 
 
విశాఖలో అక్రమ కట్టడాలంటూ శుక్రవారం రాత్రి నుంచే కూలగొడుతున్నారని చెప్పారు. కోర్టులు శని, ఆదివారాలు కూడా తెరిచే విధంగా చూడాలని కోరారు. విశాఖలో బెంచ్ ఏర్పాటు చేయాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని, లేకపోతే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉందని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments