Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పిచ్చి పీక్స్ చేరింది.. అసెంబ్లీ రౌడీ'లా చంద్రబాబు... జీవీఎల్

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (15:19 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పిచ్చి పీక్స్ చేరింది... ఆయన ఓ అసెంబ్లీ రౌడీలా ప్రవర్తించారంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ కామెంట్ పోస్ట్ చేశారు.
 
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, శుక్రవారం జరిగిన సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీ నేతలతో పాటు.. ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, సభలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, పైడికొండల మణిక్యాల రావులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ గడ్డపై పుట్టి కేంద్రానికి ఊడిగం చేస్తారా అంటూ నిలదీశారు.
 
విభజన నష్టపోయిన ఆంధ్రాకు మోడీ చేస్తున్న అన్యాయాన్ని సిగ్గులేకుండా ప్రశ్నిస్తారా అంటూ నిలదీశారు. ఇదే విషయాన్ని నేను ప్రస్తావిసే జైల్లో పెడతారా? మీకు వ్యతిరేకంగా ఉంటే ఫినిష్ చేస్తారా? ఎమ్మెల్యేలుగా ఉండే అర్హత మీకు లేదంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.
 
దీనిపై ఏపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న జీవీఎల్ నరసింహారావు శనివారం ట్వీట్ చేశారు. "సీఎం చంద్రబాబు అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజుగారితో ప్రవర్తించిన తీరు చూస్తే "పిచ్చి పీక్స్"కు చేరినట్లు తెలుస్తోంది. మహా ఫ్రస్ట్రేషన్లో వున్న సీఎం "అసెంబ్లీ రౌడీ"లాగా ప్రవర్తించారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంటెస్ట్ ద్వారా డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు

నింద చిత్రానికి అంతర్జాతీయ స్ట్రీమింగ్ కి ఆమోదం

మ్యాడ్ స్క్వేర్ చిత్రం నుండి స్వాతి రెడ్డి.. గీతం విడుదల

అమెరికా, ఆస్ట్రేలియా లో కూడా రిలీజ్ కాబోతున్న పా.. పా.. మూవీ

ట్రెండింగ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ ఫన్నీ వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

తర్వాతి కథనం
Show comments