Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కిలారు దిలీప్ కుమార్ కామెంట్స్..

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (13:45 IST)
గత రెండు మూడు రోజులుగా బెంజ్ సర్కిల్ వద్ద కార్మికలు పడే ఇబ్బందులు చూసి వారిని పరమర్శించాలని భావిస్తే పోలీసులు మాకు అక్కడకు వెళ్ళడానికి అవకాశం కల్పించలేదు అని.. ఈ కార్మికులు బాధలు వర్ణతీతం అని.. తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని విజయవాడ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కిలారు దిలీప్ కుమార్ అన్నారు.

ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రోజుకు ఒకపూట మాత్రమే వారు భోజనం చేస్తున్నారన్నారు. ఇదివరకు వారికి 700 రోజికి కూలి ఇస్తే ప్రస్తుతం 300 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. కార్మికులలో ఈ మధ్యకాలంలో ముగ్గురు చనిపోయారని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మరీనా తర్వాత కార్మికులకు తిండి లేకుండా చేస్తే ఈ ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ప్రశ్నించారు. కార్మికులు ఇసుక లేక రోడ్డున పడ్డారనీ, కార్మికుల వారి ఇంటికి వెళ్లకుండా రోడ్డున పడ్డారనీ, రక్తం అమ్ముకొని కార్మికులు జీవిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్రానికి లేఖ రాస్తామని తెలిపారు. వీరందరికి రెండు మూడు రోజులలో న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇసుక పాలసీపై జగన్మోహన్ రెడ్డి మూడు నెలలు పాటు తాత్సారం ఎందుకు చేశారని ప్రశ్నించారు. రేపు ఇసుక పాలసీపై ఫైనల్ చేసి ఎల్లుండి కల్లా అందుబాటులోకి తీసుకొని రాకపోతే ప్రధాని నరేంద్ర మోడీకి రిప్రజెంటేషన్ చేస్తామని తెలిపారు. 
 
అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు అని జనవరి 6 నాడు  6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ పుస్తకం రిలీజ్ చేశారు. మీరు చేసిన ఆ బుక్ నిజమైతే ఈ మూడు నెలల్లో ఎక్కడైనా అవినీతి పట్టుకొని అరెస్టులు చేశారా అని ప్రశ్నించారు. కేవలం ప్రజలను మోసం చేయడానికి మాత్రమే మీరు ఈ బుక్ రీలేజ్ చేశారా అంటూ నిలదీశారు.

ఇసుక విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి ఏమిటి మీరు చేయని అవినీతి ఏమిటని ప్రశ్నించారు. అవాస్తావలను ప్రచారం చేసి ఓట్లు వేసుకున్నారనీ, గతంలో ట్రాక్టర్ ఇసుక 3 వేలు అమ్మితే ఇప్పుడు 7 వేలు నుండి 10 వేలు వరకు కొన్ని చోట్ల అమ్ముతున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి 6 నెలలు సమయం ఇవ్వాలని భావిస్తే ఆయన చేసే తప్పులు మీద తప్పులు చేయడంతో ఖండించడం జరుగుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments