Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వోద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (17:01 IST)
ప్రభుత్వోద్యోగులకు బయోమెట్రిక్ హాజరును ఇక నుంచి తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వ ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ ఆదిత్య నాథ్ దాస్. 
 
కరోనా కారణంగా 2020 మే నెల నుంచి బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం… ఈ నెల 13 తేదీన జరిగిన కార్యదర్శుల సమావేశంలో బయోమెట్రిక్ హాజరును తప్పని సరిగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
 
సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న బయోమెట్రిక్ పరికరాలను తిరిగి సిద్ధం చేయాలని ఐటీ శాఖను ఆదేశించారు సీఎస్. సచివాలయం సహా హెచ్ఓడి కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, స్యయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర విభాగాలు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
బయోమెట్రిక్ హాజరు నమోదుకు నెలవారిగా నివేదికలను ప్రభుత్వానికి పంపాలని సూచనలు జారీ చేశారు. ప్రతీ శాఖ కార్యదర్శి ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ ద్వారా పరిశీలించాలని సూచనలు చేశారు సిఎస్. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు, జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలను జారీ చేశారు సీఎస్ ఆదిత్య నాథ్ దాస్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రదర్శించబడుతుందని ఎప్పుడూ ఊహించలేదు : రానా దగ్గుబాటి

పోసాని క్షమార్హులు కాదు... ఆయనది పగటి వేషం : నిర్మాత ఎస్కేఎన్

తండేల్ నుంచి నాగ చైతన్య, సాయి పల్లవిల బుజ్జి తల్లి రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments