కర్నూలులో టీడీపీ షాక్... వైకాపాలో చేరిన అఖిల ప్రియారెడ్డి మేనమామ

Webdunia
ఆదివారం, 17 మార్చి 2019 (11:16 IST)
కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి దెబ్బపై దెబ్బ తగులుతుంది. టీడీపీకి చెందిన పలువురు నేతలు వైకాపాలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా ఏపీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియా రెడ్డి మేనమామ ఎస్వీ జగన్ రెడ్డి వైకాపా తీర్థంపుచ్చుకున్నారు. 
 
హైదరాబాద్, లోటస్ పాండ్ జగన్ నివాసానికి వచ్చిన ఎస్వీ జగన్ రెడ్డి, పార్టీ కండువాను కప్పుకున్నారు. ఆళ్లగడ్డకు చెందిన జగన్‌, ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీ జగన్ రెడ్డి వైసీపీలో చేరికతో ఆళ్లగడ్డలో పార్టీ మరింతగా బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇప్పటికే ఆళ్లగడ్డలో పేరున్న ఎస్వీ సుబ్బారెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి కుటుంబాలు వైసీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
 
మరోవైపు, నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసే అవకాశం ఉంది. తనకు టిక్కెట్ కేటాయించని పక్షంలో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. మొత్తంమీద ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీని వీడి వైకాపాలో చేరేందుకు అనేక మంది నేతలు క్యూకడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments