Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : భాస్కర్ రెడ్డికి షాక్ - అవినాష్ రెడ్డికి ఊరట

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (17:15 IST)
మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టు అయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి షాక్ తగిలింది. మరోవైపు, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ నెల 25వ తేదీ వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దని సీబీఐను హైకోర్టు ఆదేశించింది. 
 
మరోవైపు, వివేకా హత్య కేసులో అరెస్టు చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు ఆరు రోజుల కష్టడీ విధించింది. ఆ మేరకు వారిద్దరి కస్టడీ సీబీఐకి అనుమతి ఇచ్చింది. వివేకా హత్యకు భాస్కర్ రెడ్డి నెల రోజుల క్రితమే కుట్ర పన్నారని, అందుకోసం రూ.40 కోట్లను సిద్ధం చేసుకున్నారని తెలిపారు. అందులో రూ.నాలుగు కోట్లు చేతులు మారాయని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. 
 
భాస్కర్ రెడ్డి సమాజంలో పలుకుబడి వున్న వ్యక్తి అని దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని, పైగా అతడు విచారణలో సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు వివరించారు. అందుకే అతడిని అరెస్టు చేశామని, కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు తెలిపారు. దీంతో వారిద్దరినీ కోర్టు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
 
ఇదిలావుంటే, ఇదే కేసులో కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశించింది. అవినాష్ విచారణకు సంబంధించి వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలని స్పష్టం చేసింది. 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డి రోజూ విచారణకు హాజరుకావాలని సూచించింది. ఆ రోజున ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తుది తీర్పును వెలువరిస్తామని పేర్కొంది. 
 
కాగా, అవినాశ్ రెడ్డి అరెస్ట్ భయంతో తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పైన న్యాయమూర్తి వాదనలు ఆలకించారు. మంగళవారం వాడిగా, వేడిగా వాదనలు జరిగాయి. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తుది తీర్పు వచ్చే వరకు అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments