పరకామణి చోరీ కేసులో ఇరికించేందుకు దుష్టచతుష్టయం కుట్ర : భూమన

ఠాగూర్
మంగళవారం, 25 నవంబరు 2025 (19:42 IST)
పరకామణి చోరీ కేసులో తనను ఇరికించేందుకు దుష్టచతుష్టయం తీవ్రంగా ప్రయత్నిస్తోందని వైకాపా నేత, తితిదే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో ఆయన మంగళవారం సిట్ విచారణకు హాజరయ్యారు. అంతకుముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తనను ఈ కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. 
 
నిజం చెప్పాలంటే ఈ కేసుకు తనకు, భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు. దుష్టచతుష్టయం తనను ఈ కేసులో ఇరికించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. వీరిలో నారా లోకేశ్, వర్ల రామయ్య, పట్టాభి, తితిదే చైర్మన్ బీఆర్ నాయుడులు ఉన్నారని, వీరంతా తనను విచారించాలని సిట్ అధికారులపై ఒత్తిడి చేశారన్నారు. ఆ ఒత్తిడిని భరించలేకే సిట్ అధికారులు తనను విచారణకు పిలిచారని చెప్పారు. 
 
ఏపీలో కొత్తగా మరో రెండు జిల్లాలు.. రంపచోడవరం కూడా పరిశీలన 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఇందులో భాగంగా, మార్కాపురం, మదనపల్లె ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటుకానున్నాయి. అలాగే, పోలవరం ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అంటే మూడు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. 
 
జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాలు, రెవన్యూ డివిజన్లలో మార్పులు చేర్పులు తదితర అంశాలపై మంత్రులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మరోమారు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు అనగాని సత్య ప్రసాద్, వంగలపూడి అనిత, పి.నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు హాజరయ్యారు.
 
కాగా, ఈ కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఈ కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసి ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. దానిపై సీఎం చంద్రబాబు రెండు రోజులుగా కసరత్తు చేస్తున్నారు.
 
ఇదే అంశంపై మరోమారు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలతోపాటు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చింది. 
 
రంపచోడవరం, చింతూరు డివిజన్లు కలిపితే తూర్పుగోదావరి జిల్లా మరింత పెద్దదిగా తయారవుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు. మార్కాపురం (ప్రస్తుతం ప్రకాశం జిల్లా), మదనపల్లె (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా), రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం పచ్చజెండా ఊపినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments