Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరీష జీన్స్, టీషర్ట్ వేసుకుంటే.. చున్నీతో ఎలా ఉరేసుకుంటుంది..?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శిరీష ఆత్మహత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏ1 నిందితుడిగా ఉన్న శ్రవణ్ వెల్లడించాడు. హైదరాబాదు, ఫిల్మ్ నగర్ లోని ఆర్జీఏ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కే

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (13:05 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శిరీష ఆత్మహత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏ1 నిందితుడిగా ఉన్న శ్రవణ్ వెల్లడించాడు. హైదరాబాదు, ఫిల్మ్ నగర్ లోని ఆర్జీఏ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసుకు తనకు లింకు లేదన్నాడు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం మీడియా ప్రశ్నించడంతో స్పందించిన శ్రవణ్... తాను కేవలం రాజీవ్‌కు స్నేహితుడిని మాత్రమేనని తెలిపాడు. 
 
అలాగే  శిరీషతో తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రవణ్ చెప్పాడు. ఎస్సై ప్రభాకర్ రెడ్డి చాలా కాలంగా స్నేహితుడు కావడంతో రాజీవ్‌కు సహాయం చేసేందుకు వారితో కలిసి వెళ్లానని.. శిరీషను హత్య చేశారనే వార్తల్లో నిజం లేదన్నాడు. అయితే శిరీష ఆత్మహత్య కేసులో పోలీసులు తెలిపిన వివరాలపై ఆమె కుటుంబీకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
శిరీషను తీసుకెళ్లిన రాజీవ్, శ్రావణ్ లు ఆమెను కేవలం చర్చలకే తీసుకెళ్లారా? లేక ఎస్సైతో ఏదైనా లోపాయికారీ ఒప్పందం చేసుకుని తీసుకెళ్లారా? సెటిల్ మెంట్ కి తీసుకెళ్లిన మహిళపై ఎస్సై అత్యాచారయత్నం ఎందుకు చేశాడు? జీన్స్‌పై షర్ట్ ధరించిన శిరీష వద్దకు చున్నీ ఎలా వచ్చింది? ఆరు అడుగుల పొడవు, 80 కేజీల బరువున్న శిరీష ఫ్యాన్‌కు ఉరివేసుకోవడం సాధ్యమా?అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments