వరదల పట్ల అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్లకు జగన్‌ ఆదేశం

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (08:26 IST)
గోదావరి వరద పరిస్థితులపై సీఎం వైయస్‌.జగన్‌ ఆరా తీశారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాలనుంచి ఇప్పటికే చాలామందిని తరలించారని, వచ్చే వరదను దృష్టిలో ఉంచుకుని మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా సీఎంఓ అధికారులు సీఎంకు వివరించారు.

ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లకు ఈమేరకు ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా ఆయనకు తెలిపారు. వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలపై దృష్టిపెట్టాలని, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా వారిని రక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా సహాయపునరావాస శిబిరాలు తెరిచి వారికి అన్నిరకాల సౌకర్యాలు అందించాలన్నారు.

ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం స్పష్టంచేశారు. రక్షణ చర్యలు, సహాయ పునరావాస కార్యక్రమాలకోసం ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్‌ సహా సంబంధిత సిబ్బందిని సిద్ధంచేసుకోవాలన్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణా శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లును ఆదేశించారు.

గోదావరి వరద ఉద్ధృతి, ముంపు పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. ఇటు కృష్ణాజిల్లాలోకూడా భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై సీఎం ఆరాతీశారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ బాధితులను ఆదుకోవాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments