Webdunia - Bharat's app for daily news and videos

Install App

మున్సిప‌ల్ ఆఫీసులోనే స్నానం...పానం! ద‌టీజ్ జేసీ ప్రభాకర్ రెడ్డి

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (12:16 IST)
తాడిప‌త్రి మున్సిప‌ల్ ఛైర్మ‌న్, తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి త‌న‌దైన శైలిలో మున్సిపల్ అధికారులకు కౌంట‌ర్ ఇస్తున్నారు. అధికార సిబ్బంది తాను ఛైర్మన్ అయ్యాక కూడా తనకు సహకరించట్లేదంటూ ఆరోపిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్నంగా త‌న నిర‌స‌న‌ను కొన‌సాగిస్తున్నారు.

మున్సిప‌ల్ ఆఫీసులోనే నిన్న రాత్రి నిద్ద‌రపోయిన జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి... ఉద‌యం స్నానం కూడా ఆరుబ‌య‌ట ఇలా పైపు నీళ్ళ‌తో చేశారు. అక్క‌డే బ‌ట్ట‌లు మార్చుకుని, మున్సిప‌ల్ అధికారుల కోసం వెయిట్ చేస్తున్న‌ట్లు చెప్పారు మున్సిప‌ల్ ఛైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి. 
 
నిన్న మున్సిప‌ల్ ఛైర్మ‌న్ అధికారుల కోసం కార్యాల‌యంలో వేచి ఉండ‌గా, అంతకుముందే ఎమ్మెల్యే పెద్దారెడ్డితో కలిసి బయటికి వెళ్లిన అధికారులు సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో అసహనానికి గురైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆఫీస్ వద్దే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. రాత్రికి కార్యాలయంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఉంటారని చెబితే, ఏదో స‌ర‌దాకి అంటున్నార‌ని అధికారులు, జేసీ అనుచరులు కూడా అనుకున్నారు.

కానీ, వారి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ, జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి రాత్రి మున్సిప‌ల్ కార్యాల‌యంలోనే ప‌డుకున్నారు. ఉద‌యం నిద్ర లేచి అక్క‌డే స్నానం కూడా చేసేశారు. అక్క‌డే బ‌ట్ట‌లు వేసుకుని. మున్సిప‌ల్ అధికారుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక అధికారులు వ‌చ్చాక ఎంత గ‌డ‌బిడి అవుతుందో అని అంతా టెన్ష‌న్ గా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

ఘాటి నుంచి అనుష్క శెట్టి స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రివీల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

తర్వాతి కథనం
Show comments