Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 15 నాటికి వైఎస్సార్ జగనన్న కాలనీల్లో బేస్ మెంట్లు పూర్తి చెయ్యాలి: కలెక్టరు ఏఎండి ఇంతియాజ్

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (09:45 IST)
కృష్ణజిల్లాలో వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తొలిదశలో చేపట్టనున్న ఇళ్ళ నిర్మాణానికి సంబందించి ఈ నెల 15 వ తేదీలోగా బేస్ మెంట్ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టరు ఏఎండి ఇంతియాజ్ గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు.

స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ, ఆర్ డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టరు ఇంతియాజ్ జాయింట్ కలెక్టరు(అభివృద్ది) శివశంకర్ తో కలసి తొలి దశలో నిర్మించే గృహనిర్మాణ పనులు పురోగతిపై డివిజన్ల వారీ సమీక్షించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నవరత్నాల్లో భాగంగా జిల్లాలో తొలి దశలో నిర్మించే 1,67,500 గృహాలకు సంబందించి ప్రభుత్వం రూ. 3 వేల 16 కోట్లు మంజూరు చేసిందన్నారు. లబ్దిదారుల గృహ స్థలాలకు సంబందించి రిజిస్ట్రేషన్లు, మ్యాపింగ్, జియోట్యాగింగ్ వంటి అంశాలు ఏమైనా పెండింగ్ లో ఉంటే అధికారులు సమన్వయంతో త్వరిత గతిన పూర్తి చెయ్యాలని ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణం చేపట్టే ప్రతి కాలనీలో ఆర్ డబ్య్లూఎస్ అధికారులు నీటి సౌకర్యాన్ని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఇళ్లు కట్టుకునేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 15 లోగా లబ్దిదారుల ఇళ్ల స్థలాల్లో బేసిమెట్లు పూర్తయ్యేవిధంగా చర్యలు చేపట్టాన్నారు.

ఇళ్ల నిర్మాణానికి సిమ్మెంట్, ఇనుము, ఇసుక అందించేందుకు  ప్రభుత్వం సిద్దంగా ఉందని లబ్దిదారులు  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రోత్సహించాలన్నారు. తొలిదశలో అర్హత పొంది కూడా ఇంటినిర్మాణం చేపట్టని లబ్దిదారులు ఎవరైనా ఉంటే వారి స్థానంలో వేరోకరికి అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments