Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏప్రిల్ 1న కరోనా టీకా వేయించుకోనున్న సీఎం జగన్‌

Advertiesment
ఏప్రిల్ 1న కరోనా టీకా వేయించుకోనున్న సీఎం జగన్‌
, బుధవారం, 31 మార్చి 2021 (21:17 IST)
గుంటూరులో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. విజయవాడలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, పురపాలక ఛైర్మన్‌లు, వైస్‌ ఛైర్మన్‌ల ఓరియెంటేషన్‌ ప్రొగ్రామ్‌లో పాల్గొననున్నారు. 
 
ఉదయం 11.10 - 11.55 గంటల వరకు గుంటూరు భారత్‌పేట 6వ లైన్‌ వార్డు సచివాలయం చేరుకున్న అనంతరం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ తర్వాత వ్యాక్సిన్‌ చేయించుకోనున్నారు.
 
అబ్జర్వేషన్‌లో ఉండటంతో పాటు సచివాలయం, వైద్య సిబ్బందితో సమావేశం అవుతారు.అనంతరం తాడేపల్లి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.00- 3.25 గంటలకు విజయవాడ ఏ కన్వెన్షన్‌ చేరుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బండారు సత్యనారాయణ మూర్తి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే కేసు పెడతాం