Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెదురు మ‌దురు సంఘ‌ట‌న‌ల‌తో ముగిసిన బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (16:33 IST)
బ‌ద్వేల్ ఉప ఎన్నిక పార్టీల మ‌ధ్య చెదురు మ‌దురు సంఘ‌ట‌న‌ల‌తో ముగిసింది. పోలీసులు వైసీపీకి స‌హ‌కరించార‌ని బీజేపీ నేత‌లు ఇక్క‌డ ఆరోపించారు. ఒక ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు  ఫిర్యాదు చేశారు. వైసీపీకి ఎస్సై చంద్రశేఖర్ సహకరిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపిస్తూ, ఆయ‌న‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక సందర్భంగా పలు చోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. వైసీపీ శ్రేణులకు పోలీసులు సహకరిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు ఆయన ఫిర్యాదు చేశారు. ఎస్ఐ చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. 
 
మరోవైపు బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్ మాట్లాడుతూ 149, 150 పోలింగ్ బూతుల వద్ద ఎస్ఐ చంద్రశేఖర్ వైసీపీ పోలింగ్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బయటి ప్రాంతానికి చెందిన వందలాది మంది నిన్న రాత్రే బద్వేల్ నియోజకవర్గానికి చేరుకున్నారని అన్నారు. పోలీసుల తీరు చూస్తుంటే వారే దగ్గరుండి రిగ్గింగ్ చేయిస్తున్నట్టు ఉందని మండిపడ్డారు. 
 
మరోవైపు బద్వేల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి మాట్లాడుతూ, పలు బూతుల్లో బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు కూర్చున్నారని ఆరోపించారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా వైసీపీ గెలుపు ఖాయమని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments