ఎపిఎస్ ఆర్టీసిలో అతిపురాతనమైన కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారయింది. 1952 లో ప్రారంభించిన ఏపిఎస్ ఆర్టీసి క్రెడిట్ కో-ఆఫరేటివ్ సోసైటీ (సిసియస్)కు ఆసియా ఖండంలోనే మంచి పేరు ఉంది. ఆర్టీసి ఉద్యోగుల ఆర్దిక ఇబ్బందులను గట్టిక్కించేందుకు ఆర్టీసి ఉద్యోగుల నుండి వసూళ్లు చేసిన నిధులతోనే ఏర్పాటుచేసుకొన్న ఈ సిసియస్ సోసైటీ ప్రస్తుతం రూ.1,600 కోట్ల టర్నోవర్‌తో నడుస్తోంది. ఈ సోసైటీకి ప్రతి రెండు వందల మంది ఉద్యోగులకు ఒక ప్రతినిధిని ఎన్నుకొని ఈ ప్రతినిధుల ద్వారా తొమ్మిది మంది పాలకమండలి సభ్యులను ఎంపిక చేస్తారు. గెలిచిన ఈ ప్రతినిధులు పాలకమండలి ఏర్పాటు చేస్తారు.
ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈసిసియస్ ప్రతినిధుల ఎంపిక కాలపరిమితి ఈఏడాది డిసెంబర్ 30 తో పూర్తవుతున్నందున ఈ ఏడాది డిసెంబర్ 14 న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 129 డిపోలు/నాన్ ఆపరేషన్/వర్క్‌షాప్, యూనిట్లలో మొత్తం 210 మంది ప్రతినిధుల ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. సిసియస్ బోర్డు ఏర్పాటు కోసం పాలక మండలి ఎంపిక డిసెంబర్ 29 న నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం ఆర్టీసి హౌస్‌లో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఐఖ్యకూటమి పాలకమండలి సభ్యులతో జరిగిన సిసియస్ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపి పిటిడి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు లు బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
ఈ పాలకమండలి సమావేశంలో సోసైటీ వైస్ చైర్మన్, ఆర్టీసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఏ) ఏ.కోటేశ్వరరావు, సొసైటీ నామినేటడ్ మెంబర్ ఆర్టీసి ఛీఫ్ ఫైనాన్సు మేనేజర్ యన్.సుధాకర్ మరియు ఉద్యోగుల తరుపున ఎంపికైన ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఎంపికైన సిసియస్ పాలకమండలి సభ్యులు, వేడుంబాకుల వెంకటేశ్వరరావు, ములుపురి శ్రీనివాసరావు, యం.యం.రెడ్డి, యం.మల్లయ్య, మురిపి శ్రీనివాసరావు,యం.చాంద్ భాషా తోపాటు ఆర్టిసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులు టి.ధశరద, సోసైటీ కార్యదర్శి తలాటం త్రాసు పాల్గొన్నారు.