Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగరెట్లలో నింపి గుప్పుమంటూ పీల్చుతూ బీటెక్ విద్యార్థుల గం'జాయ్'

హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ గుట్టు సంచలనం రేపుతోంది. ఇంతలో బీటెక్ విద్యార్థుల గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సిగరెట్లలో గంజాయి నింపి గుప్పుమంటూ పీల్చుతూ బీటెక్ విద్యార్థుల ఎంజాయ్ చేస్త

Webdunia
ఆదివారం, 16 జులై 2017 (13:19 IST)
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ గుట్టు సంచలనం రేపుతోంది. ఇంతలో బీటెక్ విద్యార్థుల గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సిగరెట్లలో గంజాయి నింపి గుప్పుమంటూ పీల్చుతూ బీటెక్ విద్యార్థుల ఎంజాయ్ చేస్తున్న వైనం హైదరాబాద్ నాగోల్‌లో బహిర్గతమైంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఎన్విరాన్‌ టవర్స్‌ అపార్టుమెంట్ల సముదాయంలో ట్రిపుల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌లో కొందరు యువకులు గంజాయి తాగుతున్నట్లు సమాచారం అందింది. ఎల్బీనగర్‌ పోలీసులు శుక్రవారం రాత్రి అక్కడికి వెళ్లి తనిఖీలు చేపట్టగా ఐదుగురు యువకులు గంజాయి తాగుతూ పట్టబడ్డారు. నిందితులను ఎల్‌బీనగర్‌ నాగార్జున కాలనీలో ఉండే ఎల్‌ఎల్‌బీ విద్యార్థి కనమంత సాయి అనిరుధ్‌ రెడ్డి(20), నాగోల్‌కు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి మారం సాయి ప్రణీత్‌రెడ్డి(19), నాగోల్‌కు చెందిన బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్టూడెంట్‌ రామగిరి ఫెలెక్స్‌ (19) వరంగల్‌ ఘన్‌పూర్‌ చెల్పూరుకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి వీరమనేని దిలీప్‌(21), వరంగల్‌ పర్కాల్‌ గ్రామానికి చెందిన బలుగూరి శ్రీకాంత్‌రావు(21)గా గుర్తించారు. 
 
నిందితులంతా గంజాయికి బానిసలైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ యువకులపై కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించారు. వీరి నుంచి 2 గంజాయి పాకెట్లు(50 గ్రాములు), లైటర్‌, 5 సెల్‌ఫోన్లు, తాగి పారేసిన సిగరెట్‌ పీకలు, సిగరెట్‌ యాష్‌, యాష్‌ ట్రే (పరిశోధన నిమిత్తం) స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ముగ్గురు బీటెక్‌ విద్యార్థులే కావడం విశేషం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments