Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ విదేశీ టూర్ ఖర్చులడిగితే... ప్రశ్నలో అస్పష్టత ఉందంటూ జవాబు దాటేసిన పీఎంఓ!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ఖర్చులు ఇవ్వండి అంటూ సమాచార హక్కు ఉద్యమకారిణి నూతన్ ఠాకూర్ ప్రధానమంత్రి కార్యాలయ అధికారులను కోరారు. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఇష్టంలేనీ పీఎంవో... వేసిన ప

Webdunia
ఆదివారం, 16 జులై 2017 (12:47 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ఖర్చులు ఇవ్వండి అంటూ సమాచార హక్కు ఉద్యమకారిణి నూతన్ ఠాకూర్ ప్రధానమంత్రి కార్యాలయ అధికారులను కోరారు. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఇష్టంలేనీ పీఎంవో... వేసిన ప్రశ్నలో అస్పష్టత ఉందని పేర్కొంటూ జవాబును దాటవేసింది. పైగా, పిఎంఓ డైరెక్టర్ సయ్యద్ ఎక్రామ్ రిజ్వీని కలవాలంటూ ఓ ఉచిత సలహా ఇచ్చింది. 
 
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాల్లో పర్యటించడం కంటే.. విదేశాల్లో పర్యటించేందుకే అధికంగా ఇష్టపడుతున్నారు. ప్రధానంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు, వివిధ దేశాలతో స్నేహభావం పెంపొందించేందుకే ఈ పర్యటనలు చేస్తున్నట్టు మీడియాలో వార్తాకథనాలు వస్తున్నాయి. 
 
అయితే, ప్రధాని విదేశీ పర్యటనల సందర్భంగా ఎంత ఖర్చవుతుంతో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. సరిగ్గా ఇటువంటి సమాచారాన్నే తెలుసుకుందామనుకున్న నూతన్ ఠాకూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మాజీ ప్రధాని మన్మోహన్, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను తెలియజేయాలని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారులను ఆమె కోరారు.
 
దీనికి సంబంధించి 2010 నుంచి ఇప్పటివరకూ ఉన్న సమాచారం కావాలని అభ్యర్థించారు. అయితే సమాచారం ఇచ్చేందుకు పీఎంఓ అధికారులు నిరాకరించారు. పైగా ఈ ప్రశ్నలో అస్పష్టత ఉందని ఆరోపించారు. పీఎంఓ అధికారి ప్రవీణ్ కుమార్ ఈ సమాచారాన్ని అందించేందుకు నిరాకరిస్తూ, దీనికి సంబంధించి అడిగిన ప్రశ్నలో అస్పష్టత ఉందని పేర్కొన్నారు. పైగా, పీఎంవో డైరక్టర్‌ను కలవాలని సూచించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments