అనకాపల్లి నర్సీపట్నం మున్సిపల్ అధికారులపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. చెప్పరాని, రాయడానికి వీల్లేని భాషలో అధికారులను బూతులు తిట్టారు. తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరించారు. కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులు అంటూ బూతులు తిట్టారు. ఇష్టం లేకపోతే దెం..యండి అంటూ బిగ్గరగా అరిచారు. త్వరలో నేను స్పీకర్ అవుతున్నాను.. మిమ్మల్ని అసెంబ్లీలో గంటలు కొద్ది నిలబెడతాను హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.