Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లా బాపట్లకు మహర్దశ: రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో వైద్య కళాశాలలు?

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (17:14 IST)
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల పేరిట పలు జిల్లాల్లో భూములను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రి నిర్మాణం కోసం 50 ఎకరాలను, కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిలకలపూడిలో ప్రభుత్వ వైద్య కళాశాల కోసం 29.60 ఎకరాల భూమిని కేటాయించింది.
 
అలాగే గుంటూరు జిల్లా బాపట్లకు మహర్దశ పట్టబోతోంది. గుంటూరు జిల్లా జమ్ములపాలెంలో 51.07 ఎకరాల విస్తీర్ణంలో వైద్యకళాశాల ఏర్పాటు చేయనున్నారు. ఇంకా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 12.58 ఎకరాలను కేటాయించింది. కాకినాడ అర్బన్‌ మండలం రమణయ్య పేటలో 15.76 ఎకరాలను రంగరాయ వైద్య కళాశాల స్థాయి పెంపు కోసం కేటాయించింది.
 
అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రభుత్వ వైద్య కళాశాల కోసం పశు సంవర్థక శాఖకు చెందిన 48.49 ఎకరాలను బదలాయించింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల కోసం ఉచితంగా భూములను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments