Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్లలో జోష్‌ను నింపనున్న జగన్ సర్కారు.. ఉగాదికి..?

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (16:18 IST)
ఏపీ ప్రభుత్వం వాలంటీర్లలో జోష్‌ను నింపనుంది. తమ జీతాలు పెంచాలని కొన్ని జిల్లాల్లో వాలంటీర్లు డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగాది రోజున ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పేరిట మూడు కేటగిరీలుగా వార్డు, గ్రామ వార్డు వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం సత్కరించనుంది. 
 
సేవా వజ్రకు రూ.30 వేల నగదు, సేవా రత్నకు రూ. 20 వేలు, సేవా మిత్రకు రూ.10 వేల నగదు పురస్కారాన్ని, శాలువాతో ఏపీ ప్రభుత్వం సత్కరించనుంది. సత్కారానికి నవరత్నాల అమలులో చూపిన చొరవ, కోవిడ్, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అందించిన సేవలను పరిగణనలోకి తీసుకోనున్న ప్రభుత్వం... ఏప్రిల్ 13 తేదీన వార్డు, గ్రామ వాలంటీర్లను సత్కరించే కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments