Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు ఆటో డ్రైవర్ .. ఇపుడు ఆటో సర్పంచ్ .. ఎవరు?

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (12:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో ప్రశాంతంగా ముగిశాయి. దీంతో అనేక మంది సామాన్యులు ఇపుడు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఇలాంటి వారిలో వివిధ వృత్తులు చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నవారు ఉన్నారు. ఈ క్రమంలో నిన్నామొన్నటివరకు ఆటో డ్రైవరుగా ఉన్న వ్యక్తి ఇపుడు ఆటో సర్పంచ్‌గా మారిపోయాడు. దీనికి కారణం.. గ్రామపంచాయతీ ఎన్నికలే. 
 
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జంగాలిపాలెం సర్పంచ్‌ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీ చేసిన గొరపల్లి నరసింగరావు మూడో ప్రయత్నంలో విజయం సాధించాడు. అతడు 1995 నుంచి టీడీపీ కార్యకర్త. చిన్న చిన్న పనులు చేసుకునేవాడు. 
 
2006 నుంచి ఆటో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉండేవాడు. 2006, 2013లో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. 
 
అయినా నిరాశ చెందకుండా తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీచేసి 94 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. పంచాయతీలోని 8 వార్డులకుగాను ఆరు టీడీపీ మద్దతుదారులే కైవసం చేసుకున్నారు. దీంతో ఆ గ్రామంలో తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments