Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సిఎం జగనే... ఎవరు చెప్పారో తెలుసా?

గడిచిన 114 రోజులుగా అలుపెరగకుండా పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్, ఆంధ్ర రాష్ట్రానికి తదుపరి సీఎం అవుతారని, ఇందులో ఎటువంటి సందేహాలు లేదని చెప్పారు వైకాపా ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పండితులు. ప్రజల స్థితిగతులను తెలుసుకుని, వారి కష్టాలను తీ

Webdunia
సోమవారం, 19 మార్చి 2018 (16:47 IST)
గడిచిన 114  రోజులుగా అలుపెరగకుండా పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్, ఆంధ్ర రాష్ట్రానికి తదుపరి సీఎం అవుతారని, ఇందులో ఎటువంటి సందేహాలు లేదని చెప్పారు వైకాపా ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పండితులు. ప్రజల స్థితిగతులను తెలుసుకుని, వారి కష్టాలను తీరుస్తానంటూ నడుస్తున్న జగన్, ఆ పని చేయనున్నారని తెలిపారు. ఇదే చైత్ర మాసంలో రాముడు పట్టాభిషేకం చేసుకున్నాడని, మరో చైత్ర మాసంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని జోస్యం చెప్పారు. 
 
ఎవరైనా కష్టపడితే రాముడు గుర్తించి విలపిస్తాడని, అదే గుణం జగన్ మోహన్ రెడ్డిలో ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజల హృదయాలను గెలుచుకునే వ్యక్తి ఆయనేనని అన్నారు. అన్ని వర్గాల్లోనూ ఆయనపై మక్కువ పెరుగుతోందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ఆయన రాష్ట్ర పాలనాధికారిగా ప్రజలకు మరింత సంక్షేమాన్ని దగ్గర చేయనున్నారని, ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పారు. 
 
కాకనూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పండితులందరూ ఐక్యమై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పారు. జ్యోతిష్యం మూఢ నమ్మకమని చాలామంది చెబుతుంటే మీరు ఇలా చెప్పడం సరైనదా అంటూ మీడియా ప్రశ్నించగా పండితులందరూ సైలెంట్ అయిపోయారు. మరి చూడాలి నిజంగానే జ్యోతిష్యులు చెప్పిన విధంగా జగన్ సిఎం అవుతారేమో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments