Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యవసర పరిస్థితిగా భావించాలి... పెథాయ్‌పై సీఎం చంద్ర‌బాబు

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (11:08 IST)
అమరావతి: రాష్ట్రంలో ప్ర‌స్తుత ప‌రిస్థితిని అత్య‌వ‌స‌ర‌ పరిస్థితిగా భావించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పెథాయ్ తుపాన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమ‌వారం ఉద‌యం 6.30 గంట‌ల‌కు టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఇందులో జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ తుపాన్ ప్రభావిత జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించాలన్నారు. దానికి తగ్గట్లుగా పనిచేయాలని, విపత్తులలో ఎవరూ సెలవులు పెట్టరాదని, అందరూ విధులకు హాజరు కావాలని, అప్పగించిన బాధ్యతను నిర్వర్తించాలన్నారు.
 
విపత్తును ఎదుర్కోవడానికి ప్రతి శాఖ యాక్షన్ ప్లాన్‌కు అనుగుణంగా పనిచేయాలన్నారు. మన రాష్ట్రంలో విపత్తులు ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా  వస్తాయనీ, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తుపాన్ల కాలం అనీ, ప్రతి జిల్లాలో ఎమర్జెన్సీ మేనేజిమెంట్ ప్లాన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు.
 
పెథాయ్ తుపాన్ కాకినాడకు దక్షిణంగా 200 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయ్యిందనీ, 20కి.మీ వేగంతో తీరంవైపు దూసుకు వస్తోందని చెప్పారు.. తీరాన్ని తాకగానే 100-110కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. యానాం-తుని మధ్య తీరాన్ని తాకుతుందని అంచనా అనీ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ వర్షాలు పడతాయని చెప్పారు.
 
జన నష్టం, పశునష్టం నివారించాలని,. ప్రజల ఇబ్బందులను తగ్గించాలని, అన్నివర్గాల ప్రజల్లో విశ్వాసం కల్పించాలని ఆదేశించారు. తాము ఉన్నామనే భరోసా ఇవ్వాలన్నారు. అన్ని వనరులను, స‌హాయ‌క సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ప్రతి గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ బాధ్యత తీసుకోవాలని,  గ్రామంలో అందరినీ చైతన్యపరచాలని, సహాయ చర్యలలో ‘ఆపద మిత్ర’లు భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చారు.
 
ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని, అల్పాహారం, భోజనం, తాగునీరు, పాలు, కూరగాయలతో సహా నిత్యావసరాలను సిద్ధంగా ఉంచాల‌ని చెప్పారు. మీ పనితీరే ప్రామాణికం. ప్రభుత్వానికి ఎక్కడా చెడ్డపేరు రాకూడదు. సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితి తేవాలన్నారు. ప్రతి గంటకు బులెటిన్ విడుదల చేయాలని చెప్పారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాల‌న్నారు. ఈ సాయంత్రానికే తాను విశాఖకు చేరుకుంటాననీ, మంత్రులు అందరూ మధ్యాహ్నానికే మండలాలకు చేరాలన్నారు.

 
సహాయ చర్యలలో పార్టీ నేతలు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. సహాయ పునరావాస చర్యలు మనందరి బాధ్యత. కేవలం ప్రభుత్వమే కాదు. అన్నివర్గాల ప్రజలు చేయూత అందించాలని చెప్పారు. కూలిన చెట్లను వెంటనే తొలగించాలని, విద్యుత్ స్థంభాలను వెంటనే పునరుద్దరించాలని చెప్పారు. మన అసమర్ధతతో ప్రజలు ఇబ్బందులు పడరాదని, బాధ్యతా రాహిత్యాన్ని సహించేది లేదన్నారు.

ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు పొజిషన్ కావాలని, అవసరమైతే హెలికాప్టర్లు సిద్దంగా ఉంచాలని ఆదేశించారు. విద్యుత్, ట్రాఫిక్ వెంటనే పునరుద్ధరించాలని, 24గంటల్లో సాధారణ స్థితి రావాలని, తాగునీటి పథకాల వద్ద జనరేటర్లు, ట్యాంకర్లు సిద్ధం చేయాలన్నారు. పోల్ డ్రిల్లింగ్ మిషన్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. టార్పాలిన్ పట్టాలు సిద్ధంగా ఉంచుకోవాలని, ధాన్యం సేకరణ కేంద్రాలు, వరి కల్లాల వద్ద టార్పాలిన్లు ఉంచాలని చెప్పారు.



ఎంతో వేగంతో గాలులు వీస్తాయని, ఎన్ని చెట్లు పడిపోతాయో, ఎన్ని విద్యుత్ స్థంభాలు విరిగిపడతాయో అన్నదానిపై ముందే అవగాహన ఉండాలన్నారు.. దానికి తగ్గట్లుగా అన్నింటినీ సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఎంత బాగా చేశామనే కాదు, ఎంత సమర్ధంగా చేశామనేదే ముఖ్యమ‌ని, నష్టాన్ని ఎంత తక్కువకు నియంత్రించామ‌న్నదే ముఖ్య‌మ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments