Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ మార్చుకున్న అసని తుఫాను - కోస్తాంధ్రకు ముప్పు

Webdunia
సోమవారం, 9 మే 2022 (22:13 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న అసని తుఫాను తన దిశను మార్చుకుంది. ఇప్పటికే తీవ్ర తుఫానుగా మారిన అని.. ప్రస్తుతం విశాఖపట్టణానికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు భారత వాతవరణ శాఖ వెల్లడించింది. 
 
అయితే, ఈ తుఫాను తొలుత ఉత్తరాంధ్ర మీదుగా ఒడిశా తీరంవైపు వెళుతుందని అంచనా వేశారు. కానీ, ఇపుడు ఈ తుఫాను దశ మార్చుకుని కోస్తాంధ్ర వైపు కదులుతున్నట్టు సమాచారం. దీంతో కోస్తాంధ్రతో పాటు తమిళనాడుకు ఈ తుఫాను ముప్పు పొంచివుంది. 
 
అయితే, భారత వాతావరణ శాఖ సోమవారం వేసిన అంచనా ప్రకారం తుఫాను మంగళవారం నాటికి ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరానికి చేరుకుంటుంది. మరో రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల తీర ప్రాంతాలను దాటే అవకాశం ఉన్నప్పటికీ, ఇది తీరాన్ని చేరుకునే అవకాశం లేదు.
 
మే 11 తేదీన ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అసని తుఫాను ప్రభావం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో నెలకొంది. నర్సీపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం, రాజమండ్రి, కోనసీమ, విజయవాడలలో వర్షాలు కురుస్తాయి. అనంతపురం, కడప జిల్లాల్లో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments