Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత!!?

ఠాగూర్
మంగళవారం, 21 మే 2024 (08:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద అందించే వైద్య సేవలు స్తంభించిపోనున్నాయి. ఈ పథకం కింద ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో ఆరోగ్యశ్రీ కింద అందించే అన్ని రకాల వైద్య సేవలను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.1500 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సివుంది. 
 
ఈ పెండింగ్ బకాయిలను తక్షణం విడుదల చేయాలంటూ ఈ అసోసియేషన్ చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది. కానీ, ప్రభుత్వం మాత్రం ఏమాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న వైద్య సేవల నిలిపివేతకు నిర్ణయించామని అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన వైద్య సేవల బిల్లులను విడుదల చేయాలని ప్రభుత్వం ఇంకా బకాయి బిల్లులను చెల్లించకపోవడాన్ని నిరసిస్తున్నట్టు అసోసియేషన్ పేర్కొంది. 
 
కాగా, ఏపీ ప్రభుత్వం సుమారు రూ.1500 కోట్ల మేరకు బకాయిలు చెల్లించాల్సివుందని తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ప్రభుత్వం రూ.50 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించిందని వెల్లడించింది. రూ.530 కోట్ల బిల్లలును సీఎఫ్ఎంఎస్‌లో అప్‌లోడ్ చేశామంటూ ఈ నెల 2వ తేదీన అధికారులు చెప్పారని, కానీ ఇప్పటివరకు చెల్లించలేదని వారు వాపోయింది. గత యేడాది ఆగస్టు నెల నుంచి ఈ బిల్లులు ఆగిపోయినట్టు అసోయేషన్ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ లోని సాంగ్ కు డాన్స్ చేసిన గౌతమ్ వాసుదేవ మీనన్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టెక్నికల్ టీమ్ మార్పు !

ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments