Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ రాజధానికి మీరు వ్యతిరేకమా? ద‌మ్ముంటే బాబును ఒప్పించండి

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (18:53 IST)
ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరిట ఈ ప్రాంత టీడీపీ నేతలు డ్రామాలు ఆడే బదులు,  వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు విశాఖే పరిపాలనా రాజధానిగా కావాలని తీర్మానించి, ఆ తీర్మానాన్ని చంద్రబాబుకు పంపాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ పరిపాలనా రాజధానికి ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అనుకూలమా? వ్యతిరేకమా? అన్నది ప్రకటించిన తర్వాతే , ఈ ప్రాంత అభివృద్ధిపై చర్చలు జరపాలని అన్నారు.

ఉత్తరాంధ్ర ప్రాంత టీడీపీ నేతలకు దమ్మూ, ధైర్యం ఉంటే విశాఖను పరిపాలనా రాజధానిగా చేసేందుకు చంద్రబాబును ఒప్పించాలని మంత్రి అవంతి కోరారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, పరిపాలనా రాజధానిగా విశాఖను అడ్డుకోవద్దని మంత్రి అవంతి హితవు పలికారు. 
 
అచ్చెన్నాయుడు ఛాలెంజ్‌ లు విసిరేముందు, ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి.  విశాఖపట్నం పరిపాలనా రాజధానికి మీరు అనుకూలమా? వ్యతిరేకమా? ఈ విషయంలో మీకు చంద్రబాబునాయుడును ఎదిరించే దమ్ము,ధైర్యం ఉందా? సూటిగా మీ అభిప్రాయం వెల్లడించండి. రాష్ట్ర చరిత్ర చూస్తే గతంలో మద్రాస్‌, కర్నూలు, హైదరాబాద్ లు రాజధానులుగా ఉన్నాయి. విభజన తర్వాత 13 జిల్లాలతో కొత్త రాజధాని ఏర్పడింది. సంపద అంతా ఒకేచోట కేంద్రీకృతం కావడం వల్లే మిగత ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు. అదే రిపీట్ అయితే 25, 30 ఏళ్ల తర్వాత అయినా, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావలంటూ ఉద్యమం మొదలవుతుంద‌ని మంత్రి చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"గేమ్ ఛేంజర్" టీజర్‌ను ఏయే థియేటర్లలో రిలీజ్ చేస్తారు?

పుష్ప-2 నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కనబెట్టేశారా? కారణం?

పారిశ్రామికవేత్త బర్త్‌డే పార్టీలో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments