Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వ‌ర‌లోనే టీటీడీ స‌హా దేవాదాయ ట్ర‌స్టు బోర్డుల నియ‌మ‌కం

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (15:29 IST)
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం స‌హా త‌ర‌లో ఏపీలోని అన్ని ట్ర‌స్టు బోర్డుల‌ను నియ‌మిస్తామ‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు తెలిపారు. దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ ప‌రిధిలోని ట్ర‌స్టు బోర్డుల నియ‌మ‌కం త్వ‌ర‌లో పూర్తి చేయాల‌ని దేవ‌దాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిని అదేశించారు.

దేవ‌దాయ ధ‌ర్మ‌ధాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాల‌యంలో మంత్రి అధ్య‌క్ష‌త‌న అధికారుల స‌మీక్ష స‌మావేశం జ‌రిగింది. స‌మావేశంలో దేవ‌దాయ శాఖ ముఖ్యకార్య‌ద‌ర్శి, క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ జి వాణి మోహ‌న్‌, అద‌న‌పు క‌మిష‌న‌ర్ చంద్ర‌కుమార్, రీజ‌న‌ల్ జాయింట్ క‌మిష‌న‌ర్ ఆజాద్‌,  భ్ర‌మ‌రాంభ త‌దిత‌రులు ఉన్నారు.

సీఎం జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి అదేశాల‌తో ఇప్ప‌టికే చాలా దేవాల‌యాల‌కు ట్ర‌స్టు బోర్డుల నియ‌మ‌కం జ‌రిగింద‌ని, మిగిలిన ట్ర‌స్టు బోర్డుల నియ‌మ‌కం కూడా త‌ర్వ‌త‌గ‌తిన పూర్తి చేయాల‌ని అధికారుల‌కు మంత్రి అదేశించారు. అదే విధంగా దేవ‌దాయ శాఖ ప‌రిధిలో ఉద్యోగుల ప్ర‌మోష‌న్ విష‌యంలో కూడా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.

ఉద్యోగుల ప్ర‌మోష‌న్ విష‌యంలో కొర్టు వివాదాలు లేకుండా న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌ను ప‌రిశీలించి చాలా కాలంగా ప్ర‌మోష‌న్ కోసం  వివిధ స్థాయిలో ఉన్న‌వారికి న్యాయం జ‌రిగే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. అధికారుల‌ను మంత్రి పాలనప‌ర‌మైన అంశాల‌ను అడిగి తెలుసుకుని, ప‌లు సూచ‌న‌లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiara Advani: గుడ్ న్యూస్ చెప్పిన కియారా దంపతులు.. పాప సాక్స్ ఫోటోతో?

టీజర్ లో మించిన వినోదం మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ఉంటుంది : చిత్ర బృందం

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి 'కన్నా నీ..' సాంగ్ రిలీజ్

Anasuya: అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నాగబంధం మూవీ

శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్, బాబీ నిర్మాతలుగా రాజమండ్రీలో తాజా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments