Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగ చేసిన పనికి... లండన్‌లో తెలుగు యువకుడి దుర్మరణం..

Webdunia
గురువారం, 27 జులై 2023 (10:29 IST)
లండన్‌లో ఓ తెలుగు కుర్రోడు మృత్యువాతపడ్డాడు. ఓ దొంగ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నంలో కారును వేగంగా నడిపి, ఆ యువకుడిని ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కుర్రోడు అక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడిని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన కిరణ్ కుమార్‌గా గుర్తించారు. మృతుని తల్లిదండ్రులు ఆరాధ్యుల యజ్ఞనారాయణ, భూలక్ష్మి. వీరికి ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు తంతి తపాలా శాఖలో పని చేస్తున్నాడు. రెండో కుమారుడు ఉన్నత చదువుల కోసం విదేశాలకు కోటి కలలతో వెళ్లగా ఇపుడు శవమై తిరిగివస్తున్నాడు. 
 
ఎంస్ పూర్తి చేసిన కిరణ్ ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా నిపుణుల సూచనల మేరకు అదనపు కోర్సులు చేస్తున్నాడు. జూన్ 26న ద్విచక్రవాహనంపై తరగతులకు వెళుతుండగా ఓ కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఓ దొంగ పోలీసులను నుంచి తప్పించుకునే క్రమంలో కిరణ్‌ను కారుతో ఢీకొన్నాడు. తీవ్రగాయాల పాలైన కిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నెలపాటు అనేక ప్రయత్నాలు చేసిన కిరణ్ కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని లండన్ నుంచి స్వదేశానికి తరలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments