Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనం సొమ్ముతో పెత్తందారుడి జల్సా ప్యాలెస్.. టాయిలెట్ ధర రూ.25 లక్షలు : టీడీపీ

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (09:37 IST)
విశాఖపట్టణంలోని రిషికొండకు బోడిగుండు కొట్టించి, అక్కడ ఏపీ పర్యాటక శాఖ పేరుతో ఏపీ ప్రభుత్వం రూ.500 కోట్లు వెచ్చించి అత్యంత విలాసమైన భవనాలను నిర్మిస్తుంది. ఈ భవనాల్లో సమకూర్చే విలాసవంతమైన సౌకర్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీనిపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. "జనం సొమ్ముతో పెత్తందారుడి జల్సా ప్యాలెస్" అంటూ సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేస్తుంది. ఈ ప్యాలెస్‌లోని మరుగుదొడ్డిలో ఏర్పాటు చేసిన కమోడ్ ధర అక్షరాలా రూ.25 లక్షలు అంటూ ఓ పోస్ట్‌ను ట్వీట్ చేసింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు అధ్వాన్నంగా ఉంటే వాటికి మరమ్మతులు చేసేందుకు డబ్బులు లేవని చేతులెత్తేసిన జగన్ రెడ్డి సర్కారు.. తన వ్యక్తిగత విలాస జీవితం కోసం జనం సొమ్మును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నారంటూ టీడీపీ, జనసేన పార్టీ నేతలు గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమయ్యేలా రిషికొండపై నిర్మించిన భవనాల్లో కల్పించిన సౌకర్యాల కోసం ఏపీ సర్కారు భారీగా నిధులను ఖర్చు చేసిందన్న విషయం తేలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments