ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

సెల్వి
గురువారం, 23 అక్టోబరు 2025 (21:46 IST)
High Speed Rail Corridors
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే రాష్ట్రంలో కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్ కోసం ప్రణాళికలను ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే రెండు ఎలివేటెడ్ హై-స్పీడ్ కారిడార్లకు రూట్ మ్యాప్‌లను రూపొందించింది. ఇవి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మీదుగా నడుస్తాయి. గంటకు 350 కి.మీ వేగంతో నడిచే రైళ్లకు మద్దతుగా ఈ లైన్‌లను నిర్మిస్తున్నారు. 
 
దీని ప్రకారం హైదరాబాద్-బెంగళూరు కారిడార్ 605 కి.మీ విస్తరించి ఉంటుంది. హైదరాబాద్-చెన్నై కారిడార్ 760 కి.మీ. కవర్ చేస్తుంది. రెండు లైన్లు కలిపి 1,365 కి.మీ. విస్తరించి ఉంటాయి, 767 కి.మీ ఆంధ్రప్రదేశ్ గుండా వెళుతుంది. దక్షిణ మధ్య రైల్వే ఈ రెండు ప్రాజెక్టులకు మొత్తం రూ.5.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. హైదరాబాద్-బెంగళూరు లైన్‌కు రూ.2.38 లక్షల కోట్లు, హైదరాబాద్-చెన్నై లైన్‌కు రూ.3.04 లక్షల కోట్లు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో, తొలుత ఈ పనులు ప్రారంభం కానున్నాయి. 
 
హైదరాబాద్-బెంగళూరు కారిడార్ రాష్ట్రంలో 263 కి.మీ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల గుండా వెళుతుంది. ఇందు కోసం ఆరు కొత్త స్టేషన్లకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం భూమి కోరుతూ ఎస్సీఆర్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. 
 
హైదరాబాద్-చెన్నై కారిడార్ పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు అనే ఏడు జిల్లాల గుండా వెళుతుంది. రాష్ట్ర రాజధాని అమరావతిని కూడా ఈ మార్గంలో చేర్చాలని అధికారులు పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments