Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అమెరికాలో అకాల మరణం, భార్య గర్భిణి

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (10:46 IST)
ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఒకరు అమెరికాలో అకాల మరణం చెందారు. గ్రీన్‌ కార్డ్‌ బ్యాక్‌లాగ్‌ లిస్ట్‌లో ఉన్న అతడి మృతితో గర్భిణి అయిన ఆయన భార్య అర్ధంతరంగా స్వదేశానికి తిరుగు ప్రయాణమవ్వాల్సి వచ్చింది. నార్త్‌ కరోలినాలో పనిచేస్తున్న శివ చలపతి రాజు మంగళవారం మృతిచెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఏ కారణంతో చనిపోయారన్న వివరాలు తెలియరాలేదు. 
 
ఆయన ఫేస్‌బుక్‌ వివరాలను బట్టి గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ప్రస్తుతం అతడి కుటుంబం అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. వీరి దరఖాస్తు బ్యాక్‌లాగ్‌ జాబితాలో ఉంది. రాజు అకాల మరణంతో ఆయన భార్య గర్భిణి అయిన సౌజన్య తిరుగు ప్రయాణం అయ్యారు. రాజమహేంద్రవరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న రాజు కొన్నేళ్లుగా నార్త్‌ కరోలినాలో ఉంటున్నారు. 
 
పలు కంపెనీల్లో పనిచేశారు. ఆయన మృతిపట్ల అమెరికాలో తెలుగు సంఘాలు స్పందించాయి. రాజు మృతదేహాన్ని స్వదేశం తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు కావాల్సిన మొత్తాన్ని సమకూర్చేందుకు పీడిమాంట్‌ ఏరియా తెలుగు అసోసియేషన్‌ (పాటా) ‘గోఫండ్‌మీ’ ద్వారా విరాళాలు సేకరిస్తోంది. మరోవైపు ఏళ్లుగా గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్న అక్కడి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments