Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నిమ్మగడ్డ'ను ఆటాడుకుంటున్న ఏపీ సీఎస్ ... కోర్టును ఆశ్రయించే యోచనలో ఎస్ఈసీ

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (12:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఓ ఆట ఆడుకుంటున్నారు. వచ్చే ఫిబ్రవరి నెలలో ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇదే అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టర్లకు, ఎస్పీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీల సాహ్ని అనుమతి ఇవ్వలేదు. దీంతో బుధవారం ఒకసారి, గురువారం మరోమారు ఈ సమావేశం వాయిదాపడింది. 
 
అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ కీలక ప్రకటన చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసమే ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు నిమ్మగడ్డ ఓ లేఖ రాయగా, వారు సమావేశంలో పాల్గొనలేదు.
 
ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎస్‌ను ఇప్పటికే అనుమతి కోరినట్లు ఎస్‌ఈసీ చెప్పారు. అయినప్పటికీ, సీఎస్ నుంచి అధికారులకు అనుమతి రాకపోవడం గమనార్హం. దీంతో ఆ వీడియో కాన్ఫరెన్స్ రద్దయింది. దీంతో సీఎస్ నీలం సాహ్నికి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ మరోసారి లేఖ రాశారు. కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేయాలని అందులో కోరినట్లు తెలిసింది.
 
నిజానికి ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సీఎస్ నీలం సాహ్నికి నిమ్మగడ్డ ఓ లేఖ రాశారు. అయితే, అధికారులంతా కోవిడ్ విధుల్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని బదులిస్తూ ఎస్ఈసీకి ఆమె లేఖ రాశారు. 
 
ఈ క్రమంలో ఆయన మరోసారి లేఖ రాసినా ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాలేదు. దీంతో, దీంతో చిర్రెత్తుకొచ్చిన నిమ్మగడ్డ ఏపీ ప్రభుత్వ సీఎస్ వైఖరిపై కోర్టును ఆశ్రయించాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, ఈ సమావేశంలో పాల్గొనాలని సీఎస్ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని జిల్లాల కలెక్టర్లు చెబుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అధికారులకు అనుమతి ఇవ్వకపోవడాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని ఎస్ఈసీ భావిస్తున్నట్లు తెలిసింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments