Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని కృష్ణమురళిపై నాన్ బెయిలబుల్ కేసులు... మొత్తం కేసులెన్నో తెలుసా?

ఠాగూర్
గురువారం, 27 ఫిబ్రవరి 2025 (11:23 IST)
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆయనపై పలు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్‌లు, వారి కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించిన కేసులో రాయచోటి పోలీసులు పోసానిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గురువారం ఆయనను శ్రీ అన్నమయ్య జిల్లా రాజంపేట కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
 
జనసేన పార్టీ నేత మణి ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న పోసానికి రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో హాజరుపరిచనున్నారు. ప్రస్తుతం పోసానిపై మొత్తం 11 కేసులు నమోదైవున్నాయి. ఈ కేసుల్లో బీఎన్ఎస్ 196,353 (2),111 రెడ్ విత్ 3 (3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
వైకాపా హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆయనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. నంది అవార్డులపై తీవ్రవిమర్శలు చేసినందుకు కూడా కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments