Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఇక ఏపీ పీజీసెట్‌

Webdunia
శనివారం, 17 జులై 2021 (14:50 IST)
అమరావతి: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలలు, అఫిలియేటెడ్‌ కాలేజీల్లోని నాన్‌ ప్రొఫెషనల్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సులకు ‘ఏపీ పీజీసెట్‌’ పేరిట ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఉన్నత విద్యాశాఖ ఆమోదం తెలిపింది. ఆ కాలేజీల్లోని పీజీ కోర్సుల సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తిగా ఈ ప్రవేశ పరీక్ష పరిధిలోకి రానుంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాక ఏపీ పీజీసెట్‌ నిర్వహిస్తారు.  
 
విద్యార్థుల ఇబ్బందులకు చెక్‌
ఇప్పటిదాకా ఆయా కోర్సుల్లో ప్రవేశాల కోసం వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులకు వ్యయప్రయాసలు తప్పడం లేదు. ఈ ఇబ్బందులను పరిష్కరించడంతోపాటు  పీజీ సీట్లను పారదర్శకంగా భర్తీ చేయడానికి ఒకే ప్రవేశ పరీక్ష ఉపకరిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

ఏపీ పీజీసెట్‌లో వచ్చిన మెరిట్‌ ఆధారంగా కోరుకున్న వర్సిటీలో విద్యార్థులు సీట్లు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అయితే యూజీసీ చట్టం ప్రకారం వర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉన్న నేపథ్యంలో ఒకే ప్రవేశ పరీక్షకు ఆయా వర్సిటీల పాలకమండళ్ల ఆమోదం తప్పనిసరి. ఉన్నత విద్యామండలి ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులకు వర్సిటీలు ఆమోదం తెలిపిన అనంతరం ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. 
 
వర్సిటీ కాలేజీల విద్యార్థులకే జగనన్న విద్యాకానుక
ఇలా ఉండగా వర్సిటీలు, వాటి పరిధిలోని పీజీ సెంటర్లలో సీట్లు పొందిన వారికి మాత్రమే జగనన్న విద్యా కానుక కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. ప్రైవేట్‌ పీజీ కాలేజీల్లోని ప్రొఫెషనల్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాల పేరిట ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు భారీగా దుర్వినియోగం అవుతున్నట్లు గతేడాది ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీంతో ప్రైవేట్‌ కాలేజీల్లోని ప్రొఫెషనల్‌ పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం రద్దుచేసింది. అదే మాదిరిగా ప్రైవేట్‌ కాలేజీల్లోని నాన్‌ ప్రొఫెషనల్‌ పీజీ కోర్సులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదని, వర్సిటీల్లో సీట్లు పొందిన వారికే మాత్రమే ఫీజులను ప్రభుత్వం భరిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments