Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీలక ప్రాంతాల్లో ఫ్లెక్సీలు - బ్యానర్లు నిషేధం : ఏపీ మంత్రి కె.నారాయణ

ఠాగూర్
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (09:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. పట్టణాల్లోని కీలక ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, పోస్టర్లను ఏర్పాటు చేయడంపై నిషేధం విధించే దిశగా ఆలోచనలు చేస్తుంది. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా చట్టాన్ని చేశాయని ఏపీ పురపాలక శాఖామంత్రి పి.నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఈ కీలక విషయాన్ని వెల్లడించారు.
 
పట్టణ ప్రధాన రహదారి సెంటర్ డివైడర్లలో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయకుండా నిషేధం విధిస్తున్నామని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు చట్టాన్ని చేశాయని గుర్తు చేసిన మంత్రి.. త్వరలో మన రాష్ట్రంలో కూడా చట్టాన్ని తీసుకువస్తామని వెల్లడించారు. అలాగే పట్టణాల్లోని గోడలకు పోస్టర్లు అంటిస్తే వాటిని వెంటనే తొలగిస్తామన్నారు. ప్రచారాలు చేసుకునేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments