Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాదులో వాల్ పోస్టర్ల ట్రెండ్‌కు బైబై.. జీహెచ్ఎంసీ

charminar

సెల్వి

, మంగళవారం, 1 అక్టోబరు 2024 (18:20 IST)
సినిమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అత్యంత చౌకైన, సులభమైన మార్గాలలో వాల్ పోస్టర్ ఒకటి. దశాబ్దాలుగా, వాల్ పోస్టర్లు సినీ పరిశ్రమలో ప్రమోషన్ కోసం సమర్థవంతమైన సాధనంగా పనిచేశాయి. సోషల్ మీడియా, టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత కూడా, థియేటర్ యజమానులు ఇప్పటికీ సినిమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వాల్ పోస్టర్లను వాడుతుంటారు. 
 
అయితే హైదరాబాదులో ముగిసేలా ట్రెండ్ నడుస్తోంది. అనధికార పోస్టర్లు, వాల్ రైటింగ్‌లు, కటౌట్లు, ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రకటించింది. ఇది వెంటనే నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు వర్తిస్తుంది.
 
ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు అందరికీ పబ్లిక్ నోటీసులు పంపారు. ఈ రూల్స్ పాటించని వారికి భారీ జరిమానాలు విధించాలని పేర్కొన్నారు. థియేటర్ల యజమానులు, ప్రింటింగ్‌ సంస్థలతో సమావేశాలు నిర్వహించి, చర్చలు జరపాల్సిందిగా డిప్యూటీ కమిషనర్‌కు జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. కాంపౌండ్ వాల్స్, బహిరంగ ప్రదేశాల పరిశుభ్రతను పాటించడానికి ఈ కఠినమైన చర్యల తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలిపిరి నుంచి తిరుమలకు కాలి నడకన బయలుదేరిన పవన్ కళ్యాణ్!