భార్య భారతీ రెడ్డికి రూ.403 కోట్లు దోచిపెట్టిన జగన్ : మంత్రి పార్థసారథి (video)

వరుణ్
శుక్రవారం, 26 జులై 2024 (12:55 IST)
గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో తన భార్య భారతీ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక, సాక్షి టీవీలకు ప్రకటన రూపంలో ఏకంగా రూ.403 కోట్లను నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దోచిపెట్టారని ఏపీ మంత్రి పార్థసారథి వెల్లడించారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, శుక్రవారం జరిగిన సభా కార్యకలాపాల్లో మంత్రి పార్థసారథి గత ఐదేళ్ల కాలంలో ప్రకటనల రూపంలో ప్రభుత్వం ఖజానా నుంచి ఖర్చు చేసిన మొత్తం వివరాలను సభ్యలకు వివరించారు.
 
గత ఐదేళ్లకాలంలో భార్య భారతీ రెడ్డి నడిపే సాక్షికి, ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలను జగన్ రెడ్డి దోచిపెట్టారన్నారు. కేవలం ఒక్క సాక్షి పత్రికకు ఇచ్చిన ప్రకటనల ఖర్చు రూ.403 కోట్లు అని తెలిపారు. మిగిలిన 20కి పైగా పత్రికలకి, ఇచ్చిన ప్రకటన ఖర్చు రూ.488 కోట్లు మాత్రమేనని ఆయన వివరించారు. 
 
సతీమణి నడిపే సాక్షికి, డబ్బులు దోచిపెట్టటంపై, హౌస్ కమిటీ వేసి విచారణ జరిపిస్తామన్నారు. ఈ ప్రక్రియలో భాగమైన అధికారులని రిలీవ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు.

అయితే, గత ప్రభుత్వం సమాచార శాఖలో కీలక అధికారిగా ఉంటా సాక్షి పత్రికకు ఇష్టానురీతిలో ప్రకటనలు ఇచ్చి, కోట్లాది రూపాయలు దోచిపెట్టిన విజయకుమార్ ఇపుడు గుట్టుచప్పుడు కూకుండా రాష్ట్ర నుంచి రిలీవ్ అయిపోయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తుండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments