Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రిపప్ప అంటే.. 'బుజ్జినాన్న' అని అర్థం - మంత్రి నిర్వచనం

Webdunia
మంగళవారం, 9 మే 2023 (11:42 IST)
'ఎర్రిపప్ప' అనే పదానికి ఏపీ మంత్రి రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు కొత్త అర్థం చెప్పారు. ఎర్రిపప్ప అంటే బుజ్జినాన్న అని అర్థం అని, ఈ మాత్రం పరిజ్ఞానం లేని విపక్ష నేతలు తనప విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఈ నెల ఆరో తేదీ శనివారం పశ్చిమ గోదావరి జిల్లాలో తన నియోజకవర్గంలోని తణుకు మండలం వేల్పూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఓ రైతు తాము పండించిన ధాన్యం మొలకలొచ్చాయని చెప్పడంతో 'ఎర్రిపప్పు మొలకలొస్తే నేనేం చేస్తాను..' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతోపాటు సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో ఓ టీవీ చానల్లో మాట్లాడిన కారుమూరి.. తాను చేసిన 'ఎర్రిపప్ప' వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. తాను రైతులను దుర్భాషలాడలేదని అంటూనే.. 'ఎర్రిపప్ప అంటే బుజ్జినాన్న' అని అర్థమని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై కూడా సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తున్నారు. 'అయితే నిన్ను కూడా ఎర్రిపప్ప అనొచ్చు కదా.. కారుమూరి బుజ్జి నాన్న' అని ఒకరంటే.. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు బుజ్జినాన్న లేనన్నమాట అని మరొకరు కామెంట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments