Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ పాదయాత్ర.... మంత్రి జవహర్

రానున్న ఎన్నికల్లో వైకాపా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ పేర్కొన్నారు. గురువారం నాడు మంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా వైసీపీ నాయకులు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (18:35 IST)
రానున్న ఎన్నికల్లో వైకాపా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ పేర్కొన్నారు. గురువారం నాడు మంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా వైసీపీ నాయకులు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని చెప్పడం విడ్డూరంగా వుందన్నారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నూరు శాతం ప్రజల్లోకి వెళ్లడంతో అసెంబ్లీ సమావేశాల్లో ఏం చర్చించాలో తెలియక అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని గుర్తు చేశారు. గత అసెంబ్లీ సమావేసాల్లో అర్థవంతమైన చర్చలకు అవకాశమివ్వకుండా గొడవలు సృష్టించి వాకౌట్ చేయడం పరిపాటి అయ్యిందన్నారు. ఈసారి మరో అడుగు ముందుకు వేసి అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తామని చెప్పడం సరికాదని అన్నారు. 
 
రాష్ట్రంలో విపక్ష నేతగా విఫలమవ్వడంతో తన కేసుల నుంచి తప్పించుకునేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు విమర్శించారు. రాజకీయ లబ్ది కోసమే జగన్ పాదయాత్ర చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెపుతారని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిని చూసి జగన్ మోహన్ రెడ్డి ఓర్వలేక పాప పరిహారపు పాదయాత్ర మొదలు పెడుతున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

దివ్యప్రభ న్యూడ్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్... పాపులారిటీ కోసమేనా (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments