Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ పాదయాత్ర అలా సక్సెస్ అవుతుందా...?

వచ్చే ఎన్నికల అనంతరం జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అంటున్నారు వైసీపీ నాయకులు. అందుకోసం ఇప్పటి నుంచే గట్టి కసరత్తు మొదలుపెట్టారు. తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గతంలో చేపట్టిన పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్ళి తిరుగులేని నాయకుడిగా పేరు సాధించడం తెలిసింద

Advertiesment
జగన్ పాదయాత్ర అలా సక్సెస్ అవుతుందా...?
, మంగళవారం, 24 అక్టోబరు 2017 (19:46 IST)
వచ్చే ఎన్నికల అనంతరం జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అంటున్నారు వైసీపీ నాయకులు. అందుకోసం ఇప్పటి నుంచే గట్టి కసరత్తు మొదలుపెట్టారు. తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గతంలో చేపట్టిన పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్ళి తిరుగులేని నాయకుడిగా పేరు సాధించడం తెలిసిందే. ఈ నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డి కూడా చివరకు పాదయాత్రపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. కానీ ఇప్పుడు ఆ పాదయాత్రకు కోర్టు తీర్పు కాస్త అడ్డంకిగా తగులుతోంది. పాదయాత్ర చేస్తున్నా వెసులుబాటు కల్పించాలంటూ సిబిఐ కోర్టులో వేసిన పిటిషన్‌ను కొట్టి వేయడంతో ఇబ్బందిగా మారింది. ఐతే పైకోర్టుకు వెళ్లేందుకు జగన్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 
 
పాదయాత్ర మొదలుపెట్టే ముందుగానే ఆయన తనకు శత్రువులుగా ఉన్న వారందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును బాగా దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రామోజీరావు కోడలు, జగన్ సతీమణి ఇద్దరూ మంచి స్నేహితురాళ్ళయిపోయారు. దీంతో వీరి మధ్య పెద్దగా గొడవలు ఉండవని అందరూ భావించారు. ఆ తరువాత రామోజీకి దగ్గరయ్యారు జగన్. 
 
ఇలా జగన్ పాదయాత్రకు పత్రికల వైపు నుంచి కూడా మెల్లగా మద్దతు కూడగట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద నవంబర్ నెల నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేసి వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న కృతనిశ్చయంతో జగన్ మోహన్ రెడ్డి వున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ దొంగే... బీజేపీ అంతకుమించిన గజదొంగ : హార్దిక్ పటేల్