లారీ కిస్తీలు క‌ట్ట‌లేక‌పోతున్నాం... హరితపన్ను నిలిపివేయండి..

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (15:10 IST)
సీఎం జగన్​కు లారీ యజమానుల సంఘం లేఖ రాసింది. కొవిడ్ ఇబ్బందుల దృష్ట్యా హరిత పన్నుపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఫైనాన్స్ కిస్తీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గుంతలమయమైన రోడ్లను అభివృద్ధి చేయాలని కోరారు. కొవిడ్​తో తాము తీవ్ర కష్టాలు పడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి పెంచిన హరిత పన్ను వసూలును వెంటనే నిలిపివేయాలని లారీ యజమానులు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్​కు లారీ ఒనర్స్ అసోషియేషన్ లేఖ రాసింది. 
 
 
కొవిడ్ కారణంగా రాష్ట్రంలో రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని లారీ యజమానులు.. సీఎం దృష్టికి తెచ్చారు. తీవ్ర మందగమనం ఉన్నందున రోజు వారి ఖర్చులను నిర్వహించడమూ కష్టమవుతోందని తెలిపారు. ఫైనాన్స్ కిస్తీలు కట్టలేకపోవడంతో వేల లారీలను ఫైనాన్స్ వారు స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం హరిత పన్ను పెంచిందని పేర్కొన్నారు. వాహనాలను బట్టి 200 రూపాయల నుంచి 20 వేలకు పన్నులు వసూలు చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. హరిత పన్ను పెంపు వల్ల లారీ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే హరిత పన్ను వసూలును నిలుపుదల చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: మాస్ జాతర లో ఆర్‌పిఎఫ్ పాత్ర గురించి రవితేజ ఏమన్నాడో తెలుసా!

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు కోసం సర్ ప్రైజ్ ఇవ్వనున్న అనిల్ రావిపూడి

Priyadarshi: యువత అల్లరి, రహస్యాన్ని సమాన స్థాయిలో మిళితం చేసే మిత్ర మండలి ట్రైలర్

Yash: కేజీఎఫ్ చాప్టర్-2తో టాక్సిక్ పోటీపడలేదు.. యష్ వల్లే అంతా జరిగింది: కేఆర్కే

మా కుమార్తె ముఖాన్ని అందుకే చూపించడం లేదు : ఉపాసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments