Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాసన మండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (13:48 IST)
నా అక్క ఆ సీట్లో కూర్చోవ‌డం నాకు చాలా సంతోషంగా ఉంద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంబ‌ర‌ప‌డిపోయారు. శాసన మండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా ఎమ్మెల్సీ జకియా ఖానమ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా జకియా ఖానమ్‌ను సీఎం వైయస్‌.జగన్ అభినందించారు. 
 
 
ఈ రోజు అధ్యక్షా అని సంభోదించే స్ధానంలో నా అక్క జకియా ఖానమ్‌ అమ్మ కూర్చోవడం చాలా సంతోషంగా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక గృహిణిగా చట్ట సభల్లో అడుగుపెట్టడమే కాకుండా, డిప్యూటీ  చైర్మన్‌గా ఈ రోజు ఆ స్ధానంలో కూర్చున్న ఆమె అంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం అన్నారు. నిజంగా మైనార్టీ అక్క చెల్లెమ్మలందరికీ ఇది ఒక సంకేతం, ఒక సందేశం. మహిళలు అన్ని రకాలుగా పైకి రావాలి, ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలి, ప్రభుత్వమన్నది తోడుగా ఉండాలి అన్న మన ప్రయత్నం ఈ రెండున్నర సంత్సరాలుగా జరుగుతోంద‌ని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. 
 
 
అందులో భాగంగా దేవుడు ఈ రోజు నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు సంతోషిస్తున్నాన‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు. మీకు మంచి జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అని సీఎం వైయస్‌.జగన్‌ డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments