Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ భవనాలకు వైకాపా రంగులు : తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు

Webdunia
బుధవారం, 20 మే 2020 (17:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పంచాయతీ భవనాలకు అధికార వైకాపా జెండా గుర్తులు వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసింది. దీంతో తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. 
 
ఈ పిటిషన్‌ని ప్రముఖ న్యాయవాది సోమయాజులు దాఖలు చేయగా, దాన్ని స్వీకరించిన కోర్టు పలు దఫాలుగా విచారణ జరిపింది. పంచాయతీ భవనాలకు ఇప్పటికీ పార్టీ రంగులను పోలినవే వేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. స్పందించిన న్యాయస్థానం.. ఆ రంగులను తొలగించమని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తుచేసింది.
 
స్పందించిన ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. వాటికి ఏ ఉద్దేశంతో ఆ రంగులు వేస్తున్నామన్న వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు హైకోర్టుకు తెలిపారు. గతంలో వేసిన రంగుతోపాటు అదనంగా మరో రంగును కలిపి వేస్తున్నట్టు న్యాయస్థానానికి తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments